సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ శాసనమండలిలో నేడు, బుధవారం వైసీపీ ఎమ్మెల్సీ లు చాల రోజులుగా డిమాండ్ చేస్తున్న తిరుమల లడ్డు నెయ్యి ఫై చర్చకు ప్రభుత్వం చర్చకు సిద్ధం కావడంతో నేటి మండలి సభలో ఉద్రిక్తలు రెచ్చగొట్టే మాటలకూ వేదిక అయ్యింది. ప్రభుత్వ పెద్దలు తిరుమల లో లడ్డు నెయ్యి ఫై ఒక ప్యూహం ప్రకారం వివాదం సృష్టించి తక్కువ రేటు నెయ్యి కొనకూడదని తీర్మానించి తమ హెరిటేజ్ తో అనుబంధం కలిగిన హిండా పూర్ డైరీ కి ప్రస్తుతం తిరుమల నెయ్యి కాంట్రాక్టు ను 350 రూపాయలు నుండి కేజీ నెయ్యికి 650 రూపాయలు పైగా రేటు పెంచి కోట్లు దండుకునే ఆర్ధిక కుంభకోణం కి పాలబడుతున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. దానికి ప్రతిగా టీడీపీ మంత్రులు పెద్ద ఎత్తున విరుచుకొని పడ్డారు. ఇక్కడ చర్చ కల్తీ నెయ్యి విషయం గురించి కాకుండా సభ తప్పుదారి పడుతుందని ఆవేశపడటం జరిగింది. చర్చకు అంగీకరించిన మంత్రులు తరుచు సభ్యులు నెయ్యి వివాదంపై మాట్లాడకుండా సూచనలు చెయ్యడం మంచి పద్దతి కాదని మోషేను వ్యాఖ్యానించారు. ఒక దశలో మంత్రి అచ్చెమ్ నాయుడు చైర్మెన్ ను ఉద్దేశించి మీరు క్రిస్టియన్ , జగన్ క్రిస్టియన్ అందుకే.. అనడంతో చైర్మెన్ మోషేను రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తాను క్రిష్టియన్ కాదని హిందువును అని అచ్చేమ్ నాయుడు క్షమాపణ చెప్పాలని, మీరు మతం పేరుతొ అవమానించాలని చుస్తునారు. క్షమాపణ చెప్పాలని, ఆదేశించడం తో మంత్రి నిమ్మల తదితరులు చెప్పిన మేరకు అచ్చేమ్ నాయుడునిజం తెలియక తప్పుగా మాట్లాడానని, చైర్మెన్ మోషేను రాజుకు క్షమాపణ చెప్పారు.‘అయితే జగన్‌ను నేను క్రిస్టియన్ అని అన్నాను, ఆ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రుల వాదన,, గందరగోళ పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు అనేక సార్లు అసహనానికి గురి సభను రేపటికి(గురువారం) వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *