సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ట్రంప్ దూకుడు నిర్ణయాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నేడు, గురువారం ఆరవ రోజుకు చేరుకుంది. ఇరాన్ మాత్రం ఒంటరిగానే ఇజ్రాయెల్ తో పాటు చుట్టుపక్కల అమెరికాకు సహాయం చేస్తున్న గల్ఫ్ దేశాలపై అదేపనిగా మిసైల్, డ్రోన్స్ తో దాడులు చేస్తూ వారి ఆదాయ వనరులను అగ్నికి ఆహుతి చేస్తుంది. అయితే, మొన్నటి వరకు సాధారణ వార్ డ్రోన్స్, మిస్సైల్స్ వాడిన ఇరాన్ ఇప్పుడు డోస్ పెంచింది. ఏకంగా బాలిస్టిక్ మిస్సైల్స్ క్యారీయింగ్ క్లస్టర్ మూనిషన్స్‌ను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ భూభాగంపై అత్యంత అధునాతన, శక్తివంతమైన వీటిని ప్రయోగించింది.. ఆ మిస్సైల్ లక్ష్యాన్ని చేరిన తర్వాత మిస్సైల్ లోనుంచి చిన్న చిన్న బాంబులు బయటకు వస్తాయి. ఆ చిన్న బాంబులు పేలుడు తీవ్రత కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. విధ్వంసం చాలా దారుణంగా ఉంటుంది. ఇజ్రాయెల్ మిలటరీ ఉన్నతాధికారులు చెబుతున్న దాని ప్రకారం.. క్లస్టర్ వార్‌హెడ్ మిస్సైల్స్‌‌‌ను తయారు చేసుకునే టెక్నాలజీ ఇరాన్‌ దగ్గర లేదు. చైనా లేదా రష్యాలు ఇరాన్‌కు సాయం చేసి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇరాన్ ద్వంస రచనతో క్రూడ్ ఆయిల్ అమ్మకాలు లేక , టూరిజం దెబ్బ తిని , రియల్ ఎసెట్ వ్యాపారం లో ఇక చెడ్డ రోజులు వచ్చాయని అరబ్ దేశాలు వాపోతున్నాయి. అమెరికా వారందరిని ఎలా కాచుకొంటుందో చూడాలి.. ఇదిలా ఉంటె తాజగా కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (UKMTO) అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *