సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ ఫై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం ఇలానే మరో 2వారలు కొనసాగితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. .ఇప్పటికే ఇరాన్‌ జలరవాణాలో మన దేశానికీ కూడా అతి కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని మూసివేయడంతో వాణిజ్య నౌక రాకపోకలు ఆగిపోయాయి. నిత్యావసర వస్తువులతోపాటు ఆయిల్‌ దిగుమతులు నిలిచిపోయాయి. క్రూడ్ ఆయిల్ తో పాటు ఇటు వంట నూనెల నుంచి వంటింట్లో వాడే పప్పుదినుసుల దిగుమతులు నిలిచిపోనున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 200 పైగా పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు 10 లక్షల లీటర్లపైనే దిగుమతులు నిలిచి పోతే వాటి కొరత పెరిగి వినియోగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు పెరిగితే చాలు దేశంలోని అన్ని నిత్యావసర ధరలు వెంటనే పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారీ వడ్డనకు సిద్ధంగా ఉన్నాయి. యుద్ధం ఆగకపోతే గల్ఫ్ దేశాలలో ఉంటున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన సుమారు 30వేల మంది వారి కుటుంబాల పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది.మరోవైపు పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌ యుద్ధంతో భారత్ కు డ్రైఫ్రూట్స్‌ దిగుమతులు నిలిచిపోయాయి.దానితో డ్రైఫ్రూట్స్‌ ధరలు పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *