సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన విషాద ఘటనలలో తాజగా మృతుల సంఖ్యా మరింత పెరిగింది. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాద ఘటనలో మరో ఇద్దరు మరణించారు. గత బుధవారం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ వీర శ్రీను (39), లక్ష్మీ కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 26కు చేరింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగిలిన నలుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం శివరాత్రి రోజు పాలు కల్తీ ఘటనలో 5 గురు మృతి చెందగా ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు మృతి చెందటంతో మృతుల సంఖ్యా 8 కి చేరుకొంది. ఇంకా మరో 6 మంది ఆసుపత్రులలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం.
