సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వేళ వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది.. ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీలో టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరందరూ ఆర్టీసీ బస్సుల్లో పరీక్షలు ముగిసేంతవరకు ఉచితంగా వెళ్లవచ్చు. అయితే కేవలం మూడు రకాల బస్సుల్లోనే టెన్త్ విద్యార్థులు ఫ్రీగా వెళ్లవచ్చు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కండక్టర్లకు టెన్త్ హాల్ టికెట్ చూపించి ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి ఇంటికి వెళ్లేందుకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
