సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కళాశాల ఫర్ ఉమెన్ (SVECW) విద్యార్థినులు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి ఇంజినీరింగ్ డిజైన్ పోటీ mBAJA SAEINDIA 2026 లో విశేష విజయాలు సాధించారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 1, 2026 వరకు ఈ పోటీని SAEINDIA సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని నర్సాపూర్‌లో ఉన్న బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించింది. శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కళాశాల ఫర్ ఉమెన్ కి చెందిన పూర్తిగా విద్యార్థినులతో కూడిన “జిబా రేసర్స్” బృందం ఈ పోటీలలో పాల్గొంది. దేశంలోని 11 రాష్ట్రాల నుండి 45 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 51 ఆఫ్‌రోడ్ బగ్గీ బృందాలు, సుమారు 1500కి పైగా విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు.పోటీ నుండి విజేతలుగా తిరిగి వచ్చిన విద్యార్థినులను నేడు, శుక్రవారం కళాశాల ప్రాంగణంలో సన్మానించారు. జిబా రేసర్స్ బృందం ఈ పోటీలలో మొత్తం ఐదు ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించింది:

  • 1వ బహుమతి – CAE అవార్డు (₹30,000)
  • 1వ బహుమతి – మాన్యుఫాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డు (₹40,000)
  • 2వ బహుమతి – వెహికిల్ స్టెబిలిటీ అవార్డు (₹20,000)
  • రన్నరప్ – యాక్సిలరేషన్ ఈవెంట్
  • బెస్ట్ డెబ్యుటెంట్ టీమ్ అవార్డుస్ గెలుచుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *