సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి రోజా నేడు, శుక్రవారం భీమవరం లోని పవిత్ర పంచారామ క్షేత్రం లోని శ్రీ సోమేశ్వరుడిని దర్శించుకొన్నారు. తదుపరి ఆలయం బయట మీడియా తో మాట్లాడుతూ.. ఇటీవల హిందూ దేవాలయాలలో వరుసగా జరుగుతున్నా అపవిత్ర అంశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని, సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు విషయంలో చేసిన రచ్చ తో వీరు అసలు హిందువులేనా అని అనుమానం కలుగుతుందని దేవుళ్ళ ప్రసాదాల మీద విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. జగన్ గారిని అవమానించాలని అసెంబ్లీ కి రమ్మంటారని కానీ, శాసనమండలి లో చైర్మన్,మోషేన్ రాజు ను సభ్యులను టీడీపీ మంత్రులు మతం పేరుతొ చేస్తున్న అవమానం.. గాడిదలా పెరిగిన మంత్రి అచ్చేమ్ నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు అందరు చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల ఎంపీపీ నరసింహరాజు తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *