సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో “50 సంవత్సరముల జాతీయ అత్యవసర పరిస్ధితి: భారత ప్రజాస్వామ్యానికి శాస్వత పాఠాలు” అనే అంశము పై పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 ను పశ్చిమ గోదావరి జిల్లా యువజన సర్వీసుల అధికారి సుంకర రాము గారి ఆద్వర్యములోపశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు 75 మంది విధ్యార్ధుల వక్తృత్వ పోటీలలో పాల్గొనగా అందులో ఐదుగురు విధ్యార్ధులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగినదని ప్రిన్సిపాల్ జి. మోజెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల అధ్యక్షులు జి వి నరసింహరాజు, కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ జి. సత్యనారాయణ రాజు, ఉపాధ్యక్షులు పాండురంగ రాజు, పాలకవర్గ సభ్యులు .. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొని రావడానికి, ఏర్పాటు చేసిన కార్యక్రమ నిర్వాహకులను విద్యార్థులను అభినందించారు.
