సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:. భీమవరం గునుపూడికు చెందిన మారేళ్ళ మాధవి కుమార్తె కమల పెళ్ళి ఖర్చుల నిమిత్తం శనివారం కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు రూ 20 వేలు సహకారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. భీమవరం గునుపూడిలో నివాసముంటున్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్వర్గీయ వెంకటేశ్వరరావు భార్య మేరెళ్ళ మాధవి, తల్లి తమ స్థల సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే అంజిబాబు ను కలిశారు. ఈ నెల 14న మాధవి కుమార్తె కమల వివాహం జరుగుతుండగా స్థల సమస్య తీరితే పెళ్లి ఖర్చులకు ఇబ్బంది ఉండదని వారు వివరించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గంటా త్రిమూర్తులు వారి సమస్య విని ఎంతో సహృదయంతో స్పందించి పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ 20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ..ఆపదలో ఉన్నవారికి సహకారం అందించడం మానవత్వమని హర్షించదగ్గ విషయమని అన్నారు.కార్యక్రమంలో ఎఎంసి వైస్ చైర్మన్ బండి రమేష్, మావుళ్ళమ్మ దేవస్థాన ట్రస్ట్ సభ్యులు గున్నేశ్వరరావు, టిడిపి జాయింట్ సెక్రెటరీ యలమంచిలి శ్రీనివాస్, వబిలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
