సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ తో అమెరికా అడ్జక్షుడు ట్రంప్ పరిస్థితి కొరివితో తలగోక్కున్నట్లు అయ్యింది.నిన్న సాటి గల్ఫ్ దేశాలపై మధ్యాహ్నం వరకు దాడులు చేసి తదుపరి ఇకపై దాడులు చెయ్యనని ప్రకటించిన ఇరాన్ మాటతప్పింది. నేటి ఆదివారం ఉదయం నుండి అదేపనిగా కువైట్ తదితర దేశాలఫై డ్రోన్స్ మిసైల్స్ తో విరుచుకుపడింది. మరో ప్రక్క అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్‌పై మిసైల్స్ తో విరుచుకుపడుతుంటే, సుమారు 1400 మంది ఇరానీయన్స్ మరియు పిల్లలు మరణించినప్పటికీ ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ తాజాగా బహ్రెయిన్ రాజధాని మేనామలోని జుఫైర్‌ జిల్లాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడగా 21 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్టు ‘టెహ్రాన్ టైమ్స్’ తెలిపింది. దాడి అనంతరం ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో యుఎస్-ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ప్రతిగా ఇరాన్ తగ్గేదే లే.. అన్న స్థాయిలో ఈ ప్రతిదాడులు సాగిస్తోంది. ఇరాన్ వాడే కేవలం 20 వేల డాలర్స్ తో ప్లాస్టిక్ తో తయారు చేసే ప్రతి డ్రోన్ బాంబు కూల్చడానికి అమెరికా 20 లక్షల డాలర్స్ విలువ చేసే మిసైల్ వాడవలసి వస్తుంది. అది పరిస్థితి. లక్షల కోట్ల యుద్ధ నష్టంతో అమెరికాకు గూబ గుయ్యుమంటుంది. ఇరాన్ కు ఆయుధాలు అమెరికా సైనిక బలగాల శాటిలైట్ మ్యాపింగ్ సమాచారం రష్యా ఇచ్చేస్తుందని అమెరికా ఆరోపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *