సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు, ఆదివారం ఉదయం భీమవరం శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలోనిర్వహించిన వేడుకలలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యేరఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుజిల్లా కలెక్టర్ సి. నాగరాణి , జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి , పాల్గొని బివి రాజు గారు ఎంతో ముందు చుపుతో బాలికలకు యువతులకు మహిళల ఉన్నత భవిషత్తు కోసం ఏర్పాటు చేసిన ఈ విద్య సంస్థ నుండి దేశస్థాయిలో ఉత్తమ విద్యార్థినులు తయారయి ప్రఖ్యాత సంస్థలలో ఉన్నత పదవులలో పనిచేస్తూ మహిళా శక్తి నిరూపిస్తున్నారని కళాశాల సిబ్బందిని వక్తలు అభినదించి , మహిళా HOD లకు ప్రతిభవంతులయిన విద్యార్థినులకు సర్టిఫికెట్లు స్కాలర్ షిప్స్ అందజేశారు. తదుపరి నేటి మధ్యాహ్నం ఉండి మార్కెట్ యార్డు ప్రాంగణంలోనిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని వివిధ రంగాలకు చెందిన 20 మంది మహిళలను శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ సన్మానించారు. అనంతరంఉండి నియోజకవర్గంలోని 1,199 స్వయం సహాయక సంఘాలకు చెందిన 11,990 మంది మహిళలకు బ్యాంకు ద్వారా మంజూరైన 1,25,62,00,000/- ల చెక్కునుఅందజేశారు. తదుపరి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తో కలసి భీమవరంలో లయన్స్ క్లబ్ వారి మహిళా కార్యక్రమంలో రఘురామ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *