సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఉండి రోడ్డులోని శ్రీకాళీ వనశ్రమం భీమవరం శాఖ ప్రథమ వార్షికోత్సవాన్ని యోగి శ్రీచంద్ర కాళీ ప్రసాద మాతాజీ ప్రవచనాలు ప్రత్యక పూజలు తో నేడు, ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబును భీమవరం ఛాంబర్ అఫ్ గౌరవ అడ్జక్షుడు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, తుమ్మలపల్లి శివ సమక్షంలో ఆమె సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. నేను అనే అహంకారం ప్రమాదకరమని, దానిని వీడితేనే నిజమైన దైవ దర్శనం కలుగుతుందని అన్నారు. భగవంతుని ఆరాధించడం పరిపూర్ణ విశ్వాసం ఉంచడం ద్వారా అనుకున్న పనులలో ఆటంకాలు తొలగుతాయన్నారు.తదుపరి యోగి శ్రీచంద్ర కాళీ ప్రసాద మాతాజీ భక్తులకు మహా ప్రసాద వితరణ ప్రారంభించారు. .
