సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ యుద్ధ పరిణామాలతో గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు, సోమవారం మరింత తగ్గాయి. నేటి ఉదయం 11గంటల సమయంలో విజయవాడ, హైదారాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,61,680కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.1960 మేర తగ్గుదల నమోదైంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 దగ్గర ఉంది ( gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1800 మేర తగ్గింది.మరోవైపు వెండి కేజీకి రూ.5 వేల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.80 లక్షలుగా ఉంది. విజయవాడ ,హైదరాబాద్ మార్కెట్ ల లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.90 లక్షలుగా ఉంది.
