సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా నేడు, సోమవారం ( మర్చి 9న ) పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 409 గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల కావలసి ఉంది. అయితే దీని గడువు పెంచుతూ ఈ నెల 18న జాబితా ప్రకటన చెయ్యాలని ఎన్నికల సంఘం మొన్న శనివారం సాయంత్రం ఇచ్చిన ఉత్తర్వులు లో వాయిదా వేశారు. ఎందుకంటే ఈ మర్చి నెల ముగింపులోగా పంచాయితీ ఉద్యోగులు ఒక వైపు ఆస్తిపన్ను వసూళ్లు, మరో వైపు స్వమిత్వ సర్వేలు, తదితర పనులతో ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు ఎన్నికల సంఘానికి మరింత గడువు కావాలని చేసిన విజ్నప్తి మేరకు మరో 10 రోజులు గడువు పెంచారు. నిజానికి జిల్లాలోని 20 మండలాల పరిధిలోని పంచాయతీలకు ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం అయినప్పటికీ వాటిలో ప్రస్తుతం లేనివారిని తొలగింపు, అలాగే ఒకే డోర్ నెంబర్ నుండి ఎక్కువ మంది ఓటర్లు ఉండటం వారిని వేర్పాటు చెయ్యడం వంటి కీలక పనులు మిగిలి ఉంటంతో లోపాలు పారదర్శకత కోసం మరికొన్ని రోజుల గడువుకు ఈసీ అంగీకరించింది.
