సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే స్థానిక సంస్థల పంచాయితీ ఎన్నికలలో భీమవరం పట్టణంలో గత వైసీపీ ప్రభుత్వం హయంలో విలీనం అయిన గ్రామాలలో ( విలీనం సవాల్ చేస్తూ కోర్ట్ కువెళ్లిన రాయలం, కొవ్వాడ అన్నవరం,తాడేరు తదితర గ్రామాలలో) కూడా ఈసారి యధాప్రకారం పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంది. మునిసిపాలిటీలు ఓటర్లు లిస్ట్ ను కూడా నిజానికి ఈ రోజే సోమవారం (మార్చి 9న) ప్రచురించలని ఎన్నికల సంఘం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకటన ను రద్దు చేసింది. ప్రస్తుతానికి పల్లెలకు సంబం ధించిన ఓటర్ల జాబితాను మాత్రమే వచ్చే మార్చి 18న ప్రకటించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయంలో విలీన గ్రా మాలను మున్సిపాలిటీల్లో కలిపి పట్టణ వార్డులను నిర్ధారించింది. కానీ అవి అమలు కాకపోగా ఎన్నికలు కూడా జరగలేదు.పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల పరిధిలో విలీన గ్రామాలున్నాయి. అయితే ఈ సారి ఎన్నికలకు విలీన గ్రామాలలో కూడా మునిసిపాలిటీలు కు సంబంధం లేకుండా సాధారణంగానే పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తారు.
