సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూతపడిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల మార్కును దాటుతున్న నేపథ్యంలో కూడ్రాయిల్ ధరలు పెరిగినా.. దేశంలో ఇంధన ధరలు పెరగవని తాజగా భారత ప్రభుత్వం ప్రకటించింది. .ఒక పక్క వంట గ్యాస్ ధరలు పెంచెయ్యడం తో ఆందోళన లో ఉన్న ప్రజలకు ఊరట కలగనుంది. పెట్రోల్ ధరలు కూడా పెరిగితే నష్టాలను ఆయిల్ కంపెనీలు భరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం.. భారత్లో ఇంధన ధరలపై భారం పడకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో ఇప్పటికే ముడి చమురు నిల్వలు 25 రోజులకు, రిఫైన్డ్ ఇంధనాలు మరో 25 రోజులకు సరిపడా ఉన్నాయని పేర్కొంది.. ఇక.. రష్యా, ఇతర దేశాల నుంచి దిగుమతులు కొనసాగుతున్న నేథ్యంలో సరఫరా స్థిరంగా ఉంది. నిజానికి గత 3 ఏళ్లు పైగా ఉకెయిన్ యుద్ధం ప్రారంభం నుండి రష్యా దగ్గరగా భారీ డిస్కౌంట్ ధరలకు ముడిచమురు కొంటున్న భారత్ లోని ఆయిల్ కంపెనీలు ఆ డిస్కౌంట్ ధరలు వాహన దారులకు పంచడం జరగనేలేదు.
