సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మాజీ మంత్రి , పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి సాంబశివరావు .. హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. అయితే కావూరి సాంబశివరావు మరణించారంటూ నేడు, సోమవారం రోజున మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే కావూరి సాంబశివరావు మరణం వార్తలపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. కావూరి కన్నుమూశారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.దయచేసి ఇలాంటి వదంతులను ప్రసారం చేయవద్దని కోరారు.
