సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం లో నేడు, సోమవారం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, వైఎస్ షర్మిల స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ లో ప్రజలనుద్దేశించి, ఉపాధి హామీ శ్రామికులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. షర్మిల మాట్లాడుతూ.. తన తండ్రి YSR ముఖ్యమంత్రిగా రాష్ట్రం సస్యశామలం చేసారని ప్రజల కోసం ఎన్నో పథకాలు తెచ్చారు అన్నారు.. ఆనాడు 2006 లో YSR ముఖ్యమంత్రిగా ఉపాధి హామీ పథకం ఏపీలో ప్రారంభం జరిగింది అన్నారు. మరి ఇప్పుడు కేంద్రం లోని రాష్ట్రంలోని ఎన్డీయే సర్కార్ దీనిని బ్రష్టు పట్టిస్తోందని అన్నారు. పేదలకు ఉపాధి లేకుండా పధకం ఎత్తేయాలని చూసున్నారు. అందుకే మన్రేగా చట్టాన్ని మార్చి కొత్త చట్టం తెచ్చారు బీజేపీ తెచ్చిన కొత్త చట్టం VB G RAM G అక్రమ చట్టం అన్నారు. మోదీ చట్టం లో పని హక్కును గ్రామ సభల నుంచి తొలగించారు గ్రామ్ జి చట్టానికి మద్దతు ఇచ్చి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. జగన్ సైతం మోదీకి బానిసఅన్నారు.ఉపాధి హామీ శ్రామికులను కాంట్రాక్టర్లకు లేబర్ సప్లై కింద పంపాలని చూస్తున్నారు . పని గంటలకు 6 నుంచి 12 గంటలకు పెంచారు 125 రోజుల పని కల్పన అనేది పచ్చి అబద్ధం ఉపాధి హామీ పథకంలో 100 రోజులు ఉంటే కనీసం 52 రోజులు ఇవ్వలేదుఅని షర్మిల విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *