సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణం వల్ల.. మన దేశం నుంచి ఎర్రసముద్రం, పశ్చిమాసియాకు కంటెయినర్ల ద్వారా ఎగుమతి అయ్యే ఆహార ఉత్పత్తులు రొయ్యలు చేపలు పోర్టుల్లో నిలిచిపోయాయి. రంజాన్ సమయంలో గల్ఫ్ దేశాలలో ఇఫ్తార్ విందులో భాగంగా పండ్లు, మాంసం ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉంటుందని, అయితే భారత్ నుండి అరబ్ దేశాలకు పండ్లు, మాంసం ఉత్పత్తులు, గుడ్లు, పాలు వంటి ఎగుమతులు పెద్ద ఎత్తున ఆగిపోయాయి. మన భారతీయ రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. . మన దేశంలో ఉన్న పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయినర్లలో సుమారు 10 వేల టన్నుల ద్రాక్ష ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, భీమవరంలో పాటు గోదావరి జిల్లాల ఆక్వా, వ్యవసాయ రైతులు కాకినాడ, చెన్నై, కృష్ణపట్నం ఓడ రేవుల నుంచి చేపలు, రొయ్యలతోపాటు బియ్యం ఎగుమతి ఓడలద్వారా పెద్ద ఎత్తున జరుగుతుంది. సుమారు 3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు మార్గమధ్యంలో నిలిచిపోయాయి. ఉల్లిపాయలు, అరటి వంటివి 300 ఏసీ కంటెయినర్లలో నిలిచిపోయాయని, ఒక్క జవహర్లాల్ నెహ్రూ పోర్టులోనే 10వేల టన్నుల పండ్లు ఆగిపోయినట్లు పోర్టు అధికారుల సమాచారం. గత ఏడాదిలో అమెరికా ట్రంప్ సుంకాలుతో నష్టపోయిన ఆక్వా రైతులకు టారిఫ్ లు తగ్గించడంతో గత 40 రోజులుగా కాస్త తేరుకొనమనుకొనే లోపే ఇరాన్ యుద్ధం వారి ఆశలపై నీళ్లు చల్లింది. పెద్ద ఎత్తున అమెరికా తో పాటు గల్ఫ్ దేశాలకు రొయ్యల ఎగుమతి చేసే గోదావరి ఆక్వా రైతులు ప్రస్తుత పరిస్థితి పట్ల చాల దిగాలుగా ఉన్నారు. సముద్ర మధ్యలో ఆగిపోయిన షిప్ లలో సరుకు క్వాలిటీ, ఇకపై రేటు స్థిరంగా ఉంటుందా అనే ఆందోళన కూడా నెలకొంది.
