సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం, అర్తమూరు గ్రామంలో ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందించడానికి కెనరా బ్యాంకు మరియు గ్రామ పంచాయితీ సుమారు 10 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన 0.5 MLD మైక్రో ఫిల్టర్ ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు నేడు, మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు , కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
