సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికి ఏ కారణం చేతనైనా ప్రమాదం సంభవించి మృతి చెందితే వారికి రూ 5 లక్షలు అందిస్తున్నామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, మంగళవారం వీరవాసరం మండలం కొణితివాడ గ్రామానికి చెందిన తాడిపత్తి మావుళ్ళమ్మ అనే వృద్ధురాలు కొబ్బరి బొండాలు వలుస్తుండగా కరెంటు షాక్ తగిలి మృతి చెందారు. క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ యరకరాజు హరిహరరాజు నేతృత్వంలో బాధితురాల కుటుంబ సభ్యులకు జనసేన భీమా రూ 5 లక్షల నగదును ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ప్రమాదాలు అనేవి చెప్పి రావని, జాగ్రత్తలు అవసరమని, సభ్యత్వం అనేది ఎంతో ముఖ్యమన్నారు. రూ 400 లతో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేసుకోవాలని, సభ్యత్వం చేయించుకోవడం వల్ల రూ 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో జనసేన, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *