సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పురాణాలలో పవిత్ర పంచారామ క్షేత్రాలలో ఒకటిగా పేర్కొనబడిన భీమవరం గునుపూడి లోని పంచారామ క్షేత్రంలో కొందరు ఆగంతకులుదేవాలయం ఎదురుగ సాక్షత్తు చంద్రుడితో ప్రతిష్ఠితమైనదిగా భావిస్తున్న చంద్ర పుష్కరిణి కొలను లో పురాతన నంది విగ్రహాన్ని ధ్వంసం చేసారు ప్రచారం జరిగింది.. ఈ విషయం తెలుసుకొన్న స్థానిక బ్రాహ్మణ సంఘాలు..శ్రీ సోమేశ్వర దేవాలయానికి 1200 ఏళ్ల క్రితం చాణ్యుక్య రాజుల కాలంలో ఏర్పాటు?చేసిన 5 నందీశ్వర పురాతన విగ్రహాలలో ఈ ద్వంసం అయిన నందివిగ్రహం ఒక్కటని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.. విషయం తెలిసిన వెంటనే భీమవరం డీఎస్పీరఘువీర్ విష్ణు, వన్ టవన్ సీఐ నాగరాజు నేటి మంగళవారం సాయంత్రం పోలీసులు విగ్రహం వద్దకు చేరుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే డీఎస్పీరఘువీర్ విష్ణు మీడియాకు ఇచ్చిన వివరణలో..హిందూ మనోభావాలు రెచ్చగొట్టే ప్రచారాలు ఆపాలని..శ్రీ సోమేశ్వర దేవాలయానికి ఈ పురాతన నంది విగ్రహం సున్నపు రాయితో ఏర్పాటు చెయ్యడంతో కాలక్రమంలో బీటలు వారి బ్రద్దలయి ఉంటుందని ,ఫిబ్రవరి 7 నుండి సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించామని, కొలను మధ్యలోకి వెళ్లి ఎవరు ఇటువంటి పని చేస్తారు? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *