సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు 30 ఏళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ గుండా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త అధునాతన సౌకర్యాలతో 130కిలోమీటర్ల వేగంతో నడిచే పచ్చరంగు ఇంజన్లు ‘నూతన ఎర్రరైళ్లు’ ఈ మార్చి నెల్లోనే పట్టాలెక్కిస్తున్నారు రైల్వే అధికారులు. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐసీఎఫ్ నుంచి ఎల్‌హెచ్‌బీకి రైల్వేశాఖ మార్చింది. వీటిలో భీమవరం town, తణుకు మీదుగా.. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ (నెంబర్లు 17480-17479) సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాలలో నడుస్తాయి. తిరుపతి-బిలా్‌సపూర్(నెంబర్లు 17482-17481) గురు, ఆదివారాల్లో మాత్రమేభీమవరం town, మీదుగా నడుస్తాయి. ఈ నాలుగు నూతన రైళ్లు 18బోగీలతో ఈనెల 16న తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున పూరి నుంచి మరొకటి బయల్దేరతాయి. తిరుపతి-అమరావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (నెంబర్లు 12765-12766) మొత్తం 15బోగీలతో ఈ నెల 21న తిరుపతి నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు వారంలో రెండురోజులు అంటే మంగళ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. ఇక గోదావరి జిల్లాలవారికి అనుకూలంగా ఉండే తిరుపతి-కాకినాడటౌన్ ఎక్స్‌ప్రెస్ (నెంబర్లు 17249-17250) మొత్తం 22బోగీలతో ( ఏలూరు తాడేపల్లి గూడెం మీదుగా) ఈ నెల 22న తిరుపతి నుంచి ఒకటి అదే రోజున కాకినాడ నుంచి మరొకటి బయల్దేరతాయి. ఇక తిరుపతి-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్(నెంబర్లు 16780-16779) మొత్తం 17బోగీలతో ఈనెల 26న రామేశ్వరంలో బయల్దేరి 27న తిరుపతికి చేరుకుంటుంది.ఈ రైలు సోమ, బుధ,శుక్ర, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది.
