సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు, మంచిలిపట్నం నుండి 5 సారులు ఎంపీగా ఎన్నికయిన మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నేడు, బుధవారం మృతి చెందారు. ఆయన మరణం పట్ల కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర సంతాపం. తెలిపారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ధీశాలి.. పార్లమెంటులో ప్రజా సమస్యలపై నిరంతరం గళం వినిపించిన గొప్ప నాయకుడు కావూరి అని ప్రశంసించారు. 2014లో నేను బీజేపీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ప్రధాని మోదీ గారి సమక్షంలో కావూరి గారు పార్టీలో చేరడం మరువలేనిది.అన్నారు. కావూరి సాంబశివరావు మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా బీజేపీ కుటుంబానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.అన్నారు .
