సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో నేడు బుధవారం జరిగిన గ్రామ సభలో నూతన భూ హక్కు పత్రాల పాస్ పుస్తకాలను 375 మంది రైతులకు స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను హై – సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించారని, పాత పాస్ బుక్స్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో ఉండగా, కొత్తవి రాష్ట్ర రాజముద్ర (అధికారిక గుర్తు)తో ముద్రించి ఉంటాయన్నారు. ఈ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుందని, ఈ పాస్ బుక్స్ లైవ్ వెబ్‌ ల్యాండ్ డేటాబేస్ నుంచి వివరాలు తీసుకొని ముద్రించినవని, ఎలాంటి తప్పులూ లేకుండా కచ్చితమైన సమాచారం ఉంటుందన్నారు. హై – సెక్యూరిటీ ఫీచర్ల కారణంగా వీటిని ట్యాంపరింగ్, కాపీ చేయడం అసాధ్యమన్నారు. ఇక బ్యాంక్ లోన్ల కోసం పాస్ బుక్ సమర్పించాల్సిన అవసరం లేదని, రుణాలు వెబ్‌ ల్యాండ్ లోన్ చార్జ్ మాడ్యూల్ ద్వారా నేరుగా మంజూరవుతాయని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామా సర్పంచ్లు, , గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *