సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ హోర్ముజ్ జలసంధిని గత 12 రోజులుగా మూసివేసిన నేపథ్యంలో..ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇరాన్ ఉపశమనం కలిగించింది. భారతీయ చమురు ట్యాంకర్ల నౌకలను హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య జరిగిన చర్చల అనంతరం.. భారత జెండాలు కలిగిన నౌకలకు టెహ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ పరిణామంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇతర ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కుంటున్నప్పటికీ, దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా భారత దేశానికీ చెందిన పుష్పక్, పరిమళ్ అనే రెండు భారతీయ ట్యాంకర్లు వ్యూహాత్మకంగా హోర్ముజ్ జలసంధిని ఎటువంటి ఇబ్బంది లేకుండా దాటినట్లు సమాచారం. కేంద్ర మంత్రి జైశంకర్ నిన్న బుధవారం నాడు రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు సహా పలువురు ఐరోపా నేతలతోనూ ఇరాన్ తోఇజ్రాయిల్ అమెరికా యుద్ధం ఆపడానికి.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను చర్చించినట్టు సమాచారం.
