సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: మాములు రైల్ టికెట్ ధరకే సామాన్య ప్రయాణికులకు మొత్తం 22 కోచ్లు అత్యున్నత స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్’ ఎక్స్ప్రెస్ రైలు సేవలు పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం తణుకు వాసులకు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కృషి తో చర్లపల్లి ( హైదరాబాద్ ) నుండి కామాఖ్య (అస్సాం) మధ్య నడిచే రైలు నెం. 15673/15674 కు జిల్లాలోని భీమవరం టౌన్, తణుకు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ (స్టాపింగ్) కల్పించింది. ప్రారంభ సర్వీస్: మార్చి 13వ తేదీన చర్లపల్లి – కామాఖ్య ‘అమృత్ భారత్’ వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీస్ ప్రారంభం అవుతుండగా ఈ రైలు 14వ తేదీ తణుకులో రాత్రి 10:50 గంటలకు, భీమవరం టౌన్లో రాత్రి 11:30 గంటలకు చేరుకుంటుంది. 15వ తేదీ చర్లపల్లి స్టేషన్ కు ఉదయం 8.30కి చేరుకుంటుంది. మార్చి 18, 2026 (బుధవారం) నుండి ఈ రైలు వీక్లీ రెగ్యులర్ సర్వీస్ ప్రారంభం కానున్నాయి. రైలు నెం. 15673 – చర్లపల్లి నుండి కామాఖ్య ప్రతి బుధవారం రాత్రి 19:40 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు గురువారం తెల్లవారుజామున 04:00 గంటలకు భీమవరం టౌన్ స్టేషన్కు, 04:30 గంటలకు తణుకు స్టేషన్కు చేరుకుంటుంది. రాజమండ్రి, దువ్వాడ మీదుగా శుక్రవారం రాత్రి 22:00 గంటలకు కామాఖ్య చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 15674 – కామాఖ్య నుండి చర్లపల్లి ప్రతి ఆదివారం రాత్రి 19:00 గంటలకు కామాఖ్యలో బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున 05:48 గంటలకు తణుకు, 06:18 గంటలకు భీమవరం టౌన్ కు మధ్యాహ్నం 14:40 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
