సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం డేగాపురం యనమదుర్రు శివారు పంచాయతీ నుంచి కొమరాడ వరకు సీసీ రోడ్డు వేయడానికి రెండు గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి చందాల రూపంలో రూ 18 లక్షలు సహకారం అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రామస్థులు అందించిన రూ 18 లక్షలను కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ గ్రామాలకు బీటీ రోడ్డు మంజూరు అయ్యిందని, అన్ని గ్రామాలకు సీసీ రోడ్లే ముఖ్యమని భావించడంతో ఈ రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు రూ 18 లక్షలు సహకారం అందించారని, ఈ 18 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు. గ్రామస్తులు, రైతులు అందించిన సహకారం అద్వితీయమని వారిని ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. అన్ని గ్రామంలోనూ కూడా త్వరలో సీసీ రోడ్లు వేయిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *