సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఈ ఘటనలో వైసీపీ నేత బొర్రా విఠల్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద పేర్ని నాని తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్సించి పోలీస్ అధికారులను ఎవరి ప్రోద్భలంతో బొర్రా విఠల్ ను తప్పుడు కేసులో అరెస్ట్ చేసారు అని నిలదీయడంతో పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేసి బొర్రా విఠల్‌ను వెంటనే విడుదల చేశారు. అయినప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. విషయంలోకి వెళ్ళితే .. . రామానాయుడుపేట సెంటర్‌లో జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ జెండా దిమ్మ నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ నిర్మాణాన్ని వైసీపీకి చెందిన స్థానిక నేత బొర్రా విఠల్ అడ్డుకున్నట్లు సమాచారం. దీనితో అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి వచ్చిన పోలీసులు వైసీపీ నేత బొర్రా విఠల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను గూడూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని వెంటనే తన అనుచరులతో కలిసి గూడూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిబంధనలకు విరుద్ధంగా జనసేన దిమ్మ నిర్మిస్తున్న వారిని వదిలేసి అడ్డుకొన్నవారిని అరెస్ట్ చెయ్యడం ఏమిటని ? చట్టం ఇలా అమలు చేస్తారా? అని పోలీస్ లను నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *