సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లోని ప్రజా సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సిపిఎం నేత జే గోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర నేడు శనివారం మొగళ్తూర్ లో 17వ రోజు కు చేరుకొంది. ఈ నేపథ్యంలో జెఎన్వి గోపాలన్ తన పాదయాత్ర లో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు. ఫై మాట్లాడుతూ.. నిత్యవసర సరుకులు ధరలు ఆకాశంలో ఉన్నాయని ప్రజలకు అందుబాటులో లేవని సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రోజుకు 300 కూడా లేని కూలీ తో రోజు గడవడం కష్టంగా ఉందని పాదయాత్ర బృందం వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం పేరుతో ఆయిలు గ్యాస్ ధరలు పెరగడం మరింత ఇబ్బందిగా ఉందని అన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా బుక్ అవ్వక పోవడం, 25 రోజులు దాటాక గ్యాస్ బుక్ చేసుకోవాలి అని ఆంక్షలు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని.. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి పదివేలు రోజులు దాటిందని అన్నారు. ధరలు తగ్గించకపోగా రకరకాల కారణాలతో పది రెట్లు 15 రెట్లు పెంచుకుంటూ వచ్చారని అన్నారు. జిల్లా లో ఇల్లు ఇళ్ల స్థలాలు పెన్షన్లు దోమలు తోపాటు కుక్కల బెడద ఎక్కువగా ఉందని అనేకమంది కుక్కకాటుకు గురై ఇబ్బందులు పడుతున్నారని పాదయాత్ర దృష్టికి వచ్చిందని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు దృష్టిపెడితే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
