సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో గత 16 రోజులుగా పలు గ్రామాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.ఆరుబయట కట్టైన దూడలను చంపుతుంది. ఈ పులి ప్రస్తుతం గత శనివారం రాత్రి శంఖవరం మండలంలోని ఉరకొండ పరిసరాల్లో కనిపించినట్లు సమాచారం. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు అవి ఫలించలేదు పులి, క్రమంగా ఇటీవల కుటుంబాలు నివసించే నివాసాల దగ్గరకు, ప్రభుత్వ సంస్థల కాలేజీల పరిసర రావడం ప్రజల్లో . విద్యార్థులలో ఉద్జ్యోగులలో భయాందోళనలకు కారణమైంది. గ్రామస్థులు రాత్రి సమయంలో బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. కొంతమంది రైతులు తమ వ్యవసాయ పనులను వాయిదా వేసుకున్నారు. అధికారులు ఎంత త్వరగా పులి ని పట్టుకొంటారో? ప్రజలకు అంత మనః శాంతిగా ఉంటుంది.
