సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ యుద్ధం కారణంగా దారుణంగా నష్టపోతూ వస్తున్న దేశీయ సూచీలు నేడు, సోమవారం ఊహించని విధంగా పైకి లేచాయి, నిజానికి నేటి, ఉదయం నష్టాలతోనే ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు రెండు వేల పాయింట్లు పైకి వచ్చింది. ఇటీవల బాగా నష్టపోయిన మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపించారు. అలాగే హోర్ముజ్ జలసంధి నుంచి 2 భారత ట్యాంకర్లు సురక్షితంగా గమ్యానికి చేరుకోవడం కూడా మదుపర్లలో సానుకూల ప్రభావాన్ని నింపింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock )( stock market).గత సెషన్ ముగింపు (74,563)తో పోల్చుకుంటే సోమవారం సాయంత్రానికి 938 పాయింట్ల లాభంతో 75,502 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 257 పాయింట్ల లాభంతో 23,408 వద్ద స్థిరపడింది బ్యాంక్ నిఫ్టీ 655 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 146 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ కాస్త తేరుకొని 92.42గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *