సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఆర్టీసీ బస్టాండ్ లోనేడు, బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 40% పైగా వికలాంగత ఉన్న వారికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించబడుతుందని, ఈ పథకం ఖర్చులను ప్రభుత్వం భరిస్తూ సక్రమ అమలు కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ పధకం ద్వారా దివ్యాంగులు మొత్తం 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్సప్రెస్, మెట్రో ఎక్సప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయని, లగ్జరీ సుదూర ప్రాంతాలకు వెళ్లే నాన్ స్టాఫ్, సప్తగిరి ఎక్సప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సుల్లో మాత్రం గతంలో ఉన్నట్లే 50 శాతం రాయితీ కొనసాగుతుందన్నారు. దివ్యాంగులను చిన్నచూపు చూడకూడదని, వారిని ఆదరించి గౌరవించాలన్నారు. ఎమ్మెల్యే కొద్దీ సేపు ఆర్టీసీ బస్సు లో దివ్యంగులతో కలసి ప్రయాణం చేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జి తోట సీతారామ లక్ష్మి , జిల్లా కలెక్టర్ నాగరాణి ,రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, టిడిపి రాష్ట్ర మెంటే పార్ధసారధి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు,,కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీఐఐసీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
