సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:14 సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,(Pawan Kalyan) , హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ‘గబ్బర్ సింగ్’ భారీ సంచలనం. మరి వారి కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) నేడు, గురువారం ఉగాది కానుకగా విడుదలైంది. శ్రీలీల (Sreeleela), రాశీ ఖన్నా(Raashii Khanna) హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న ‘ఉస్తాద్..’ కధ విషానికి వస్తే .. గబ్బర్ సింగ్ తరహా పొగరుబోతు పోలీస్‌గా నటించిన పవన్ ఇందులోనూ అలాంటి పాత్రే చేశాడు. ఓ తండా నుండి నగరానికి వచ్చిన పోలీస్ కథ ఇది.. పిల్లలు పనికి కాదు బడికి వెళ్ళాలని కోరుకుంటాడు ఉత్తమ ఉపాధ్యాయుడైన చంద్రశేఖరరావు (కె.ఎస్. రవికుమార్). అన్యాయాన్ని సహించని గూడెం పిల్లాడు ఉస్తాద్ భగత్ సింగ్‌ను ఆయనే చేరదీసి, చదువు చెప్పిస్తాడు.అప్పటి సీ.ఎం. కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చిన చంద్రశేఖరరావు ఆ తర్వాత సీఎం అవుతాడు. ఆయన శిష్యుడైన భగత్ సింగ్ ఎ.సి.పి. అవుతాడు. అయితే సీఎం కుర్చీపై కన్నేసిన చదలమర్రి నల్ల నాగప్ప (పార్తీబన్) ఎలాగైనా ఆ పదవిని చేపట్టాలని చూస్తాడు. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నానికి విఫల యత్నం చేస్తాడు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని ఏకంగా చంపేస్తాడు. చివరకు తాను సీఎం అవుతాడు. అయితే ఈ క్రమంలో అతను దేశ వ్యతిరేక శక్తులతో, టెర్రరిస్టులతోనూ చేతులు కలుపుతాడు. పదవి పిచ్చి పట్టిన నల్ల నాగప్ప మదాన్ని ఉస్తాద్ ఎలా అణిచాడు? తన గురువు చంద్రశేఖర్‌ను తిరిగి సీఎం పీఠం మీద ఎలా కూర్చో పెట్టాడు? అనేది సినిమా కథ…సినిమా ఎలా ఉందంటే.. సినిమాకు కధలో ఆత్మ మిస్ అయ్యింది. హీరో ఎంట్రన్స్ మొదటి 40 నిమిషుల తరువాతే..వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను తెర మీద చూపించిన శ్రద్థ దర్శకుడు హరీశ్ శంకర్ కథనంపై చూపించలేదు. దాంతో ప్రథమార్థంలో ఓ హీరోయిన్, ద్వితీయార్థంలో మరో హీరోయిన్ తెర మీద కొచ్చారు. సినిమాటోగ్రాఫర్స్ కూడా ఇద్దరు పనిచేశారు. అలానే సంగీత దర్శకులూనూ! ఈ సినిమాలో స్వరాలను దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు. అతి సాధారణమైన కథకు ఉగ్రవాదం, జాతీయవాదాన్ని జత చేసి హరీశ్ శంకర్ హడావిడి చేసాడు. అయితే ప్రతి సన్నివేశాన్ని కలర్ ఫుల్ గా, జోష్ తో నింపే ప్రయత్నం దర్శకుడు చేశాడు. సినిమా అలా సాగుతూ పోతుందంతే! అయితే హీరో పవన్ అభిమానుల కోసం పంచ్ డైలాగ్స్ తో, వెరైటీ స్టెప్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రథమార్థంలో వచ్చే రాశీఖన్నా పాట, ద్వితీయార్థంలో వచ్చే ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్స్ చాల బాగున్నయ్యి. ‘తొలిప్రేమ’లోని ‘నా మనస్సే‘ పాట వినడానికి, చూడటానికి హాయిగా ఉంది. అలానే సీతారామశాస్త్రి ‘రుద్రవీణ’కోసం రాసిన పాట పల్లవినీ సందర్భానుసారంగా చక్కగా సెట్ చేసారు. ఒకనాటి తమిళ హీరో పార్తీబన్ విలన్ గా బాగా చేసారు. మొత్తానికి కాలక్షేపం కి ఢోకా లేదు. పవన్ కూడా తగిన సమయం సినిమా మీద పెడితే బాగుంటుంది. మరి రాజకీయాలు అంటే? రెండు పడవలు మీద కష్టం..
