సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో దాదాపు 4 ఏళ్లుగా రష్యా నుండి చాల తక్కువ ధరకే ముడిచమురు దిగుమతి చేసుకొన్నపుడు భారత్ లో పెట్రోల్ రేట్లు ఏమాత్రం తగ్గలేదు. అంటే ఆ ఫలాలు ప్రెవేటు పెట్రోల్ కంపెనీ లకు తప్ప ప్రజలకు అందలేదు. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై పడుతోంది. ఇది సాకుగా చూపి భారత దేశ వ్యాప్తంగా తాజాగా నేడు, శుక్రవారం సాధారణ ప్రజానీకం వాడే ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. తక్షణం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.మరోవైపు, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీగా పెంచింది. ఇండస్ట్రియల్ డీజిల్ ధరను 25 శాతం పెంచింది. దీంతో లీటర్ ధర రూ.22 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఉన్న రూ.87.57 నుంచి 109.59కి ఇది పెరిగింది. ఇండస్ట్రియల్ డీజిల్‌ను విద్యుత్ అంతరాయాల సమయంలో జనరేటర్లపై నడిచే కర్మాగారాలు, ఫాపింగ్ మాల్స్, బుల్డోజర్లు, భారీ యంత్రాల్లో వాడుతుంటారు. వీటి ధరలు పెరగడం వల్ల కంపెనీల ఖర్చు పెరిగి వినియోగదారునిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.ఇక దేశంలో అన్ని నిత్యావసర సరులకుల ధరలు పెరిగిపోవడం ఖాయం.
