సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందని పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు. నేడు, శుక్రవారం భీమవరంలోని జిల్లా టిడిపి కార్యాలయంలో మంతెన రామరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో 6,28,347 నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారన్నారు. జాబ్ క్యాలెండర్లో విద్య, పోలీస్ శాఖలకు పెద్దపీట వేయడం జరిగిందని ప్రస్తుత జాబ్ క్యాలెండర్లో 3 వేల జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలు కేటాయించి విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు పునాది వేశారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్ భీమవరం టౌన్ టిడిపి ప్రధాన కార్యదర్శి చల్లబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *