సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం సమావేశమైన మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, నారాయణ ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు(Retirement Age)ను సవరిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఇకపై ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకున్నారు.ఇది రాష్ట్రంలో అతిత్వరలో అమలులోకి రానుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు పై ఏపీ ఎన్జీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు.
