సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ప్రతి రోజు వయస్సు తారతమ్యాలు లేకుండా చిన్నారులు యువతులపై జరిగే అత్యాచారాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆఖరికి మతిస్థిమితం లేని అమ్మాయిలపై కూడా కామాంధులు కనికరం చూపటం లేదు. తాజగా గ జరిగిన ఘటన మన వ్యవస్థ ఎటుపోతుందో అర్ధం కావడం లేదు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి మతిస్తిమితం లేని కుమార్తె ఉంది. చిన్నారిని ఇంటి వద్దనే ఉంచి పనుల నిమిత్తం తల్లిదండ్రులు అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న త్రినాథ్ అనే కామపిశాచి ఆ చిన్నారిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం ఇంట్లో చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు అదే వీధిలో ఉంటున్న మతిస్తిమితం లేని మరో అమ్మాయి ను విచారించారు. త్రినాథ్ అనే వ్యక్తి తనపైనా కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడని అమ్మాయి చెప్పడంతో ఇక కాలనిలో ప్రజలు తీవ్ర ఆగ్రవేశాలకు గురి అయ్యారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు కు బాలికలపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోలీసులు గాలింపులో దొరికిపోయిన త్రినాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *