సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రణవీర్ సింగ్ హీరోగా అక్షయ్ కన్నా, సంజయ్ దత్, మాధవన్,అర్జున్ రాంపాల్ వంటి సీనియర్ హీరోలు నటించిన నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ హిందీ వెర్షన్ మార్చి 19న విడుదలై మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ తో హిందీ వెర్షన్ ఇప్పటికే వందల కోట్లు కొల్లగొడుతుంది. ఇతర భాషల్లో కూడా ఈనెల 19న అదే రోజు రావాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది అని నిర్మాతలు ప్రకటించినప్పటికీ, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ సెన్సార్ సమస్యల కారణంగా ఆలస్యం అయ్యింది. రిలీజ్ వాయిదా పడుతూ నేడు శనివారం థియేటర్లలో ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సెన్సార్ పూర్తయింది. హిందీ వెర్షన్ నిడివి 3 గంటల 49 నిమిషాలు కాగా, ఈ మూడు భాషల్లో సినిమా 3 గంటల 51 నిమిషాల పాటు ఉంటుంది. కన్నడ వెర్షన్‌కు ఇంకా సెన్సార్ క్లియర్ కాలేదు. మొత్తానికి, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాతెలుగు వెర్షన్ అన్ని ప్రాంతాల్లో రేపటి ఆదివారం కూడా అడ్వాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. మొదటి సినిమాకు మించి సూపర్బ్ టాక్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *