సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి మోసాలకు సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు,ప్రముఖ వ్యాపారస్తులను కూడా మోసపోతున్నారు. తాజాగా.. పోలవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మాయాగాళ్ల వలలో చిక్కకుని భారీగా నష్టపోయారు ఆయనకు సైబర్ మోసగాళ్లు ఇచ్చిన ఒక కాలంతో ఫోన్ లో. ఒకే ఒక్క క్లిక్‌తో ఆయన బ్యాంక్ ఖాతా మెుత్తం ఖాళీ అయిపోయింది. దీనితో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మోసానికి గురై రూ.12 లక్షలు పోగొట్టుకున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలానా పేరుతో వచ్చిన ఫేక్ లింక్‌ను క్లిక్ చేయడంతో ఆయన ఫోన్‌లోకి మాల్వేర్ చేరి బ్యాంక్ ఖాతా ఖాళీ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపరిచిత లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ .. 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని బాధితులకు పోలీసులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *