సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆధునిక ఆయుధాలు, ఖండాంతర క్షిపణులు సమకూర్చుకొన్న ఇరాన్ ఫై ట్రంప్ చేయించిన దాడి పెద్ద తప్పిదమని మాజీ అమెరికా ప్రసిడెంట్ బిల్ క్లింటన్ తాజాగా చేసిన విమర్శలు సంచలనంగా మారగా.. మరో వైపు పశ్చిమాసియాలో ఇరాన్ రోజు రోజుకు తన మిసైల్స్ పరాక్రమాన్ని దాడులతో పెంచుకొంటూ పోతుంది. ఇజ్రాయెల్‌ నగరాలపై నేడు, ఆదివారం ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. గత శనివారం ఇరాన్ లోని నతాంజ్‌ అణు కేంద్రంపై ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగానే ఈ ఎటాక్స్‌ చేశామని ఇరాన్‌ ప్రకటించింది అయితే అదృష్టవశాత్తు ఎటువంటి అణు లీకేజి జరగలేదని తెలుస్తుంది. ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంలోని ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం ఉంది దీని లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ అణు పరిశోధనా కేంద్రానికి సమీపంలోని భవనాలపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు పడ్డాయి అయితే అదృష్టవశాత్తు ఈ అణు పరిశోధనా కేంద్రానికి నష్టం వాటిల్లలేదు. అయితే పౌర నివాసాలపై క్షిపణులు పడడం వల్ల దాదాపు వంద మంది గాయపడినట్టు సమాచారం. మరోవైపు ఇజ్రాయిల్ అరాద్ నగరంపై జరిగిన దాడిలో 88 మంది గాయపడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మరణాలను ఇజ్రాయెల్ అధికారులు ధ్రువీకరించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *