సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో తులసీ కల్యాణ మండపంలో గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన రొయ్య రైతుల సదస్సు లో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లాల నుండి వచ్చిన రైతులు మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాల పైగా కష్టపడి ఆక్వా రంగమును పరిపుష్టం చేసాం దేశానికి నేడు ఎంతో విలువైన 67 వేల కోట్ల విదేశీ మార్గద్రవ్యం తీసుకువస్తున్నాం. కానీ రొయ్యల రైతులు రాను, రాను కష్టనష్టాలు పాలవుతున్నారు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఒకవైపు రొయ్యల ఎక్స్పోటర్లు రొయ్యల మేతల తయారీ కంపెనీలు రైతులను దోచుకుంటున్నాయి.. మరోవైపు ప్రభుత్వం నుండి రావలసిన విద్యుత్ కనెక్షన్లు, యూనిట్ రూపాయిన్నర అంటూ సబ్సిడీలు, రుణాలు, వాటర్, డ్రైన్స్ ఏర్పాటు వంటి ప్రోత్సాహాలు కరువు అవుతున్నాయి. గత రెండు సంవత్సరాల కాలంలో ప్రాన్స్ ఎక్స్పోర్టర్స్, రొయ్యల మేతల తయారీ కంపెనీల తీరులో మార్పు రాలేదు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ సేవ కార్యక్రమాలందిస్తున్నామని గొప్పలు చెప్పినప్పటికీ వాస్తవంగా అవి ఎక్కడ రైతాంగానికి చేరడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రొయ్యల రైతులు ఐక్యంగా పోరాటానికి ముందుకు వెళ్లాలని రొయ్య రైతుల సదస్సు నిర్ణయించింది రొయ్యలకు అవసరమైన మద్దతు ధర ,గిట్టుబాటు ధర రొయ్యల ఎక్స్పోర్టర్స్ అందించాలని అలాగే రొయ్యల మేతల తయారీ కంపెనీలు ధరలు తగ్గించాలని ఏప్రిల్ నెల లోపు ప్రభుత్వం తమ డిమాండ్స్ కు అంగీకరించకపోతే కార్యాచరణకు దిగి కంపెనీలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.. జిల్లాకు చెందిన మంత్రి నిమ్మల రామానాయుడు భీమవరం MLA పులపర్తి రామాంజనేయులు ఉండి MLA కనుమూరి రఘురామ కృష్ణంరాజు లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి లోకేశ్ లతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *