సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులు..తో పెట్రోల్. గ్యాస్ కొరత ప్రపంచ దేశాల మీద చాలా వరకు ప్రభావం చూపుతున్నాయి. మరీ ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ సరఫరా మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కమర్షియల్ గ్యాస్ దొరక్క మరీ ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిని మూసి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల గ్యాస్ టాంకర్ షిప్ లు కొన్ని భారత్ తిరం చేరటంతో ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా పంపిణీ చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా నేటి సోమవారం నుండి రాష్ట్రాలకు అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా నేడు ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఏపీలో దాదాపుగా 12 లక్షల పైగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఏపీలో ఈ రెండు మూడు రోజుల్లో దాదాపుగా రెండున్నర లక్షల కమర్షియల్ సిలిండర్లను గ్యాస్ కంపెనీలు డెలివరీ పూర్తీ చేయనున్నాయి.
