సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలో దర్శక ధీరుడు రాజమౌళి, సుకుమార్ తరువాత .. డైరెక్టర్ ఆదిత్య ధర్( adhityadhar) పేరు ఇప్పుడు ఒక సంచలనంగా మారిపోయింది. ‘ఈ దర్శకుడు, రీసెంట్‌గా వచ్చిన ‘ధురంధర్ 2’తో మరోసారి తన సత్తా చాటారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ రూ. 500 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. లాంగ్ రన్‌లో రూ. 1500 కోట్ల ను సునాయాసంగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆదిత్య ధర్(Ashwatthama) తదుపరి ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పుడు సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ధురంధర్ తరువాత ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ది ఇమ్మోర్టల్ అశ్వథామ’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది సుమారు 800 కోట్ల బడ్జెట్ తో ఒక భారీ మైథో-సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. భారతీయ పురాణాల్లోని అశ్వథామ పాత్ర ను హైలైట్ చేస్తూ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో హీరోగా ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజా సమాచారం ప్రకారం,తెలుగు హీరో రామ్ చరణ్ లేదా ‘ధురంధర్’ స్టార్ రణవీర్ సింగ్‌లలో ఒకరు ఈ భారీ సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. లేక ఇద్దరు లో ఒకరు దుర్యోధనుడు మరొకరు అశ్వర్ధమా గా నటించే అవకాశం కూడా ఉంది
