సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్పీ కులాలలో పుట్టి క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. మతం మారిన తర్వాత ఎస్సీ హోదా వర్తించదు కావున, వారు తమను అవమానించారని, దాడి చేసారని అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసే కేసులు కూడా చెల్లవని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి, గత పదేళ్లుగా పాస్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే, తనపై జరిగిన ఒక దాడికి సంబంధించి ఆయన ‘ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం’ కింద కేసు నమోదు చేశారు. దీనిని ఫై గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపి, మతం మారిన వ్యక్తికి ఎస్సీ హక్కులు ఉండవని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనకు పెద్ద ఊరట లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *