సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం అంధ్ర ప్రదేశ్ లో జూనియర్ కళాశాలలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఏప్రిల్ ఒకటి నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సెకండ్ ఇయర్‌కు వచ్చిన స్టూడేంట్స్‌కు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు క్లాసులు జరుగుతాయి. మళ్లీ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో NCERT సిలబస్‌ను తీసుకొచ్చారు. CBSE విధానాన్ని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షలు ముగిశాక ఏప్రిల్‌లో తరగతులు నిర్వహించి.. ఆ తర్వాత సమ్మల్ హాలిడేస్ ఇచ్చే నిబంధనను తీసుకొచ్చారు. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు .జూన్ 1న జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
