సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ కొత్త లోక్ సభ నియోజక వర్గాలతో పాటు అన్ని రాష్ట్రాలలో కొత్తగా అసెంబ్లీ సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీట్ల పెంపుతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా దామాషా ప్రకారం పెరగనున్నాయి. కేంద్రం నిర్ణయంపై చర్చించేందుకు నేడు మంగళవారం కాంగ్రెస్ జాతీయ అడ్జక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వం అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రతిపాదన ప్రకారం సీట్ల సంఖ్య ఇలా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి చేరుతాయి.:ఈ నిర్ణయం అమలైతే ఆంధ్రప్రదేశ్’లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణాలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కి పెరుగుతాయి. దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, మాత్రం జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు పెరిగి నష్టం జరుగుతుందనే ఆందోళన కూడా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *