సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే కూడా జరుగుతుందని ప్రకటించారు.. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం ఇస్తామన్నారు. ఇక, తెలంగాణలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల సర్వే జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10 తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం ఉంటుందని అన్నారు. ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో ఇళ్ల సర్వేలో ఇంటి పరిస్థితి, ఇంటి వసతులు,వాహనాలు ఇంట్లో వాడే వస్తువులు, ఇల్లు ఎస్సీ, ఎస్టీలకు చెందినదా వంటి 34 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తొలివిడతలో గృహాల లెక్కింపు ఉంటుంది. ప్రతీ ఇంటి పరిస్థితి, సౌకర్యాలు, ఆస్తులు తదితర వివరాలు సేకరిస్తాం. ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య 30 రోజులపాటు హౌస్ లిస్టింగ్ జరుగుతుంది.
