సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అదాన్ అస్మి నేడు, మంగళవారం భీమవరం లోని తన కార్యాలయం నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులు (SDPOs), సర్కిల్ ఇన్స్పెక్టర్లు (CIs) మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు (SHOs) “జిల్లా స్థాయి నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని” నిర్వహించారు. పోలీస్ శాఖలో e-Office మరియు e-Deployment విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని, Cri-mac అలర్ట్లు మరియు ICJS లాగిన్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. CCTNS లో ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేస్తూ, ఆన్లైన్ ద్వారానే కేస్ డైరీలను (Online MR) నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొత్త చట్టాల (NCL) ప్రకారం e-Sakshya, e-Summons విధానాలను అనుసరించాలని,112 అత్యవసర సేవా స్పందన సమయాన్ని (Response Time) మరింత తగ్గించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలు మరియు పోక్సో చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా నాణ్యమైన సాక్ష్యాధారాలను సేకరించాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యాసంస్థల సెలవుల నేపథ్యంలో మిస్సింగ్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. NDPS (మాదకద్రవ్యాల) కేసులపై ఉక్కుపాదం మోపాలని,,. సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కల్పించాలని తెలిపారు.
