సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు ఉండి మండలం లో పలు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొనారు , మహాదేవపట్నం మేజర్ పంచాయతీలో గత 20 ఏళ్లుగా పూడిపోయి ఉన్న మంచి నీటి చెరువును పునరుద్ధరించి, చెరువు చుట్టూ 15 అడుగుల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించి నేటి ఉదయం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. ఇటీవల పునరుద్ధరించిన ఈ మంచి నీటి చెరువులో నేటి నుంచి నీటిని నింపడం ప్రారంభించామని తెలిపారు. ఇక ఉండి మండలం, రామచంద్రపురం గ్రామంలో 13.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ స్కూల్ ను రఘురామకృష్ణ రాజుప్రారంభించారు. అనంతరం 20.00 లక్షల రూపాయల జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మించనున్న 30KL కెపాసిటీ గల ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో కూటమి నేతలు, పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు తదితర నేతలు పాల్గొన్నారు,
